రాష్ట్రపతి రేసులో నేను లేను

రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు.;

Update: 2022-06-14 03:27 GMT
రాష్ట్రపతి రేసులో నేను లేను
  • whatsapp icon

రాష్ట్రపతి ఎన్నికల బరిలో తాను లేనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా నితీష్ కుమార్ పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా వినపడుతుంది. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను బీహార్ ముఖ్యమంత్రిగానే కొనసాగుతానని ఆయన తెలిపారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని, బీహార్ అభివృద్ధి కోసమే పాటుపడతానని నితీష్ కుమార్ తెలిపారు.

ప్రచారం జరగడంతో....
ఈ నెల 9వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన వెంటనే నితీష్ కుమార్ పేరు బాగా విన్పించింది. ఆయన పేరు ఖరారయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయనే స్వయంగా ఖండించారు. తాను రాష్ట్రపతిలో లేనని, తనకు బీహార్ అభివృద్ధి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News