హర్యానాలో ప్రభుత్వం కుప్పకూలినట్లేనా? ఎన్నికలకు ముందు ఇదేంటి?
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. ఒకరకంగా హర్యానా ప్రభుత్వం రాజకీయ సంక్షోభంలో పడినట్లే. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతును ప్రభుత్వానికి ఉపసంహరించుకుంటున్నట్లు గవర్నర్ కు లేఖరాయడంతో ఇప్పుడు గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
మద్దతు ఉపసంహరించుకోవడంతో...
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామాలు బీజేపీని షాక్ కు గురిచేశాయనే చెప్పాలి. నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్, రణ్‌ధీర్ గొల్లెన్, ధరమ్‌పాల్ గొండెర్ ప్రకటించడంతో ఇప్పడు హర్యానా ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందుల్లో పడినట్లయింది. మెజారిటీ కోల్పోవడంతో గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మరి చివరకు బీజేపీ దీనిని అధిగమించేందుకు ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.