Rajasthan : నేడు రాజస్థాన్ సీఎం ఎంపిక.. వసుంధరకు కష్టమేనట

నేడు రాజస్థాన్ ముఖ్యమంత్రిని బీజేపీ హైకమాండ్ నిర్ణయించనుంది;

Update: 2023-12-12 05:21 GMT
chief minister, bjp,  high command,  rajasthan, political news, bjp news

vasundhara bjp

  • whatsapp icon

నేడు రాజస్థాన్ ముఖ్యమంత్రిని బీజేపీ హైకమాండ్ నిర్ణయించనుంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన బీజేపీ అధినాయకత్వం ఈరోజు రాజస్థాన్ సీఎంను ఎంపిక చేయనుంది. రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారు. క్యాంప్ లు కూడా రన్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని పోటీ పడుతున్నారు. తనకు మరోసారని అవకాశమివ్వాలని కోరుతున్నారు.

అనేక మంది పోటీ...
అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో బీజేపీ హైకమాండ్ విభిన్న తరహాలో నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలన్న వ్యూహంతో ఉంది. దక్షిణ భారత దేశంలో పార్టీ దెబ్బతినడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించింది. వసుంధర రాజే, బాబా బాలక్ నాథ్ లతో పాటు అశ్వినీ వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజవర్ధన్ రాథోడ్, గజేంద్ర షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్‌వాల్, సీపీ జోషి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరి చివరకు ఎవరిని హైకమాండ్ ఎంపిక చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News