నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఒకసారి జరిగిన పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అదానీ అంశంతో పాటు విపక్ష నేతలపై సీబీఐ, ఈడీ దాడుల అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. అలాగే అనేక కీలక బిల్లులను ఈ సమావేశాల ద్వారా ఆమోదించుకోనుంది ప్రభుత్వం.
35 బిల్లులు...
ఉభయసభల్లో మొత్తం 35 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రాజ్యసభలో ఆరు, లోక్‌సభలో తొమ్మిది బిల్లులు పెండింగ్ లో ఉండగా వీటి ఆమోదం కోసం ఈ సమావేశాల్లో సభ ముందుకు రానున్నాయి. ప్రధానంగా ఆర్థిక బిల్లులను ఆమోదించుకోవడమే ప్రధాన అంశంగా ప్రభుత్వం చూస్తుంది. మరో వైపు గ్యాస్ ధరల పెంపుపై కూడా విపక్షాలు ధ్వజమెత్తనున్నాయి. ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసే అవకాశముంది.