బ్యాడ్ న్యూస్...పెరగనున్న కార్ల ధరలు

కార్ల ధరలు పెరగనున్నాయి. మరింత ప్రియం కానున్నాయి. అన్ని ప్రముఖ కంపెనీలు జనవరి నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాయి;

Update: 2021-12-06 03:32 GMT
cars, prices, maruthi, honda, january
  • whatsapp icon

కార్ల ధరలు పెరగనున్నాయి. మరింత ప్రియం కానున్నాయి. అన్ని ప్రముఖ కంపెనీలు వచ్చే ఏడాది జనవరి నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించాయి. మారుతి సుజుకి, ఆడీ, మెర్సిడస్ బెంజ్ సంస్థలతో పాటు హోండా, హుండాయ్, టాటా,రెనో వంటి ప్రముఖ సంస్థల కార్ల ధరలు కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనున్నాయి.

ముడి సరుకుల...
కార్ల స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడంతో పాటు ముడిసరుకుల ధరలు కూడా పెరగడంతో ధరలను పెంచాలని సంస్థలు నిర్ణయించాయి. కొత్త ఏడాది మామూలుగానే కార్ల ధరలు పెరుగుతూ ఉంటాయి. కొత్త రిజిస్ట్రేషన్ కావడం, కొత్త మోడల్స్ ను వినియోగదారులు కొనుగోలు చేయడానికి ఇష్టపడటం వల్ల కార్ల ధరలు పెరగడమే కాకుండా వాటి కొనుగోళ్లు కూడా పెరుగుతాయి. అందుకే కార్ల ధరలను పెంచాలని అన్ని తయారీ సంస్థలు నిర్ణయించాయి.


Tags:    

Similar News