సుప్రీంకోర్టులో అదానీ ఇష్యూ
పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది;
పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదానీ సంస్థలపై హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికపై విచారణ కోరుతూ దాఖలైన పిటీషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదానీ గ్రూపు సంస్థలు నష్టాల్లోకి వెళ్లడం, మదుపరులు తీవ్రంగా నష్టపోవడంతో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరపాలని విశాల్ తివారి అనే న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు.
ప్రజాప్రయోజన వ్యాజ్యం...
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటుగా మరో పిటీషన్ కూడా నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రెండు పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ బేబీ పార్దివాలాల ధర్మాసనం పేర్కొంది. దీంతో దీనిపై నేడు విచారణ జరగనుంది.