ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు

బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేస్తుంది.

Update: 2022-08-24 03:53 GMT

బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు చేస్తుంది. బీహార్ లో రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో ఇద్దరు నేతల ఇళ్లల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ పార్లమెంటు సభ్యుడు ఫయాజ్, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఇళ్లపై ఈ సోదాలు జరుగుతున్నాయి. వీరిద్దరూ రైల్వే శాఖలో ఉద్యోగాల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తుంది. వీరిలో ఎమ్మెల్సీ సునీల్ సింగ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు. ఆర్జేడీ కోశాధికారిగా సునీల్ సింగ్ వ్యవహరిస్తున్నారు.

విశ్వాస పరీక్ష రోజునే...
మరో వైపు ఈరోజు బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ను ఎదుర్కొంటుంది. విశ్వాస పరీక్షలో తమ ఎమ్మెల్యేలను బెదిరించేందుకే సీబీఐని కేంద్ర ప్రభుత్వం ఉసిగొల్పుతుందని ఆర్జేడీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలను బెదిరించినా ఎవరూ లొంగరని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. విశ్వాస పరీక్ష రోజునే ఈ దాడులు జరపడం వెనక ఆంతర్యమేంటని ఆయన ప్రశనించారు.


Tags:    

Similar News