కరోనా కొత్త మార్గదర్శకాలు జారీ.. మీకూ ఈ లక్షణాలున్నాయా ?

తాజా మార్గదర్శకాల ప్రకారం.. స్టెరాయిడ్లను కలిగి ఉన్న మందులు, అధిక మోతాదులో ఉపయోగించినట్లయితే, మ్యూకోర్మైకోసిస్

Update: 2022-01-18 12:20 GMT

2020లో మొదలైన కరోనా.. వివిధ దశల్లో రూపాంతరం చెందుతోంది. ప్రస్తుతం థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ గా రూపాంతరం చెంది.. మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా సోకినవారికి స్టెరాయిడ్స్ ఇవ్వకుండా చికిత్స చేయాలని ఈ మార్గదర్శకాల్లో సూచించింది. కరోనా తేలికపాటి, తీవ్రమైన లక్షణాల కోసం వివిధ ఔషధాలను సూచించింది. అలాగే ఎవరైనా రెండు, మూడు వారాలపాటు నిరంతర దగ్గుతో బాధపడుతుంటే వెంటనే క్షయ (టీబీ) పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం.. స్టెరాయిడ్లను కలిగి ఉన్న మందులు, అధిక మోతాదులో ఉపయోగించినట్లయితే, మ్యూకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వంటి సెకండరీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అందుకే వీటి వాడకంపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కోవిడ్ సోకిన రోగుల్లో అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్నవారినే ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స చేయాలని సూచించింది. తీవ్రంగా కరోనా లక్షణాలు ఉన్న వారికి రెమెడెసివిర్ డ్రగ్ ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. మూత్ర సంబంధిత వ్యాధులు ఉన్న‌వారికి, ఆక్సిజ‌న్ స‌పోర్ట్‌ అవసరం లేని వారికి ఈ ఔష‌ధాన్ని ఇవ్వ‌కూడ‌దు. తీవ్ర వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి 48 గంట‌ల‌లోపు టోసిలిజుమాబ్ డ్ర‌గ్‌ను ఇవ్వ‌వ‌చ్చని కేంద్రం కొత్తమార్గదర్శకాల్లో పేర్కొంది.





Tags:    

Similar News