చంద్రయాన్-3 ల్యాండింగ్.. లైవ్ ఎక్కడ చూడొచ్చంటే?

ఆగష్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండింగ్ షెడ్యూల్ చేశారు

Update: 2023-08-23 06:25 GMT

ఆగష్టు 23న సాయంత్రం 6:04 గంటలకు చంద్రయాన్-3 ల్యాండింగ్ షెడ్యూల్ చేశారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్, చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టనుంది. రష్యా పంపించిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ తో పాటు చంద్రయాన్-2 ప్రాజెక్టు చివరి క్షణంలో విఫలం కావడంతో ప్రపంచ దేశాల చూపు మొత్తం ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు పైనే ఉంది.

ఈ చారిత్రాత్మక క్షణాలను ప్రతి ఒక్కరూ చూడాలని అనుకుంటూ ఉంటారు. సాయంత్రం 5:20 గంటలకు ఇస్రో వెబ్ సైట్ తో పాటు ఇస్రో యూట్యూబ్ చానెల్, డీడీ నేషనల్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ దిగే అద్భుత క్షణాన్ని చూసేందుకు యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చారిత్రాత్మక చంద్రయాన్-3 ల్యాండింగ్ దూరదర్శన్ టీవీ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే సమయంలో, ఇస్రో వెబ్‌సైట్, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపాయి.
ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ కానుంది. ఈ కీలక ఘట్టాన్నిఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈ లైవ్ టెలీకాస్ట్ ను కింది ప్లాట్ ఫామ్స్ పై చూడవచ్చు.
ISRO వెబ్‌సైట్
ISRO YouTube ఛానెల్
ISRO ఫేస్‌బుక్ పేజీ
DD నేషనల్ టీవీ ఛానెల్‌
నేషనల్ జియోగ్రాఫిక్ టీవీ ఛానెల్‌
డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌లో
ఈ రోజు సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం ఉంటుంది.


Tags:    

Similar News