48 గంటలే అత్యంత కీలకం: సీఈసీ రాజీవ్ కుమార్

ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

Update: 2024-05-11 05:26 GMT

ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కు ముందు 48 గంటలు కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఈసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ, తెలంగాణలలో...
నాలుగో విడత జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించామని తెలిపారు. నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలని ఆదేశించారు. హింసకు తావులేకుండా శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఈసీ రాజీవ్ కుమార్ సూచించారు.


Tags:    

Similar News