గొప్ప జడ్జిని కాకపోవచ్చు.. జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగం

ఎన్నో కష్టాలు పడి తాను పైకి వచ్చానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

Update: 2022-08-26 12:15 GMT

ఎన్నో కష్టాలు పడి తాను పైకి వచ్చానని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తాను గొప్ప జడ్జిని కాకపోవచ్చు కాని సామాన్యుడికి న్యాయం అందేలా కృషి చేశానని తెలిపారు. సుప్రీంకోర్టులో జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సభ జరిగింది. పదవీ విరమణ సందర్భంగా ఆయనకు జరిగిన వీడ్కోలు సభలో ప్రసంగించారు.17 ఏళ్ల వయసులో తాను ట్రేడ్ యూనియన్స్ కు నాయకత్వం వహించానని తెలిపారు. పన్నెండు ఏళ్ల వయసులో తాను కరెంట్ ను చూశానని చెప్పారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగానికి గురయ్యారు.

ఎన్నో కష్టాలు...
వృత్తి జీవితంలో ఎననో సవాళ్ళను ఎదుర్కొన్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సామాన్యుడు స్వేచ్ఛగా గొంతు వినిపించే ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నారు. అన్యాయం జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ న్యాయస్థానం ఆశ్రయిస్తారన్నారు. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. న్యాయవాదులు కూడా తమ వృత్తి ధర్మాన్ని పాటించాలన్నారు. కరోనా సమయంలో జూనియర్ న్యాయవాదులు ఎంతో బాధలు పడ్డారని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ అందరికీ న్యాయం అందేలా చూడాలని అన్నారు.


Tags:    

Similar News