14వ రోజుకు చేరిన రాహుల్ యాత్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతుంది. 14వ రోజు యాత్రను రాహుల్ ప్రారంభించారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతుంది. 14వ రోజు యాత్రను రాహుల్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ 385 కిలోమీటర్లకు పైగా నడిచారు. కొచ్చి నుంచి ప్రారంభమైన యాత్రను మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచ్ బ్రేక్ కు ఆపుతారు. తిరిగి నాలుగు గంటలకు బయలుదేరి రాత్రి ఏడు గంటల వరకూ యాత్ర కొనసాగుతుంది. యాత్రలో వేల సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. ఈరోజు 13 కిలోమీటర్లు యాత్ర జరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఉండటంతో ఆయన కాంగ్రెస్ అధ్కక్ష పదవికి పోటీ పడరనే వార్తలు వస్తున్నాయి. ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ కేంద్ర మంత్రి శశిధరూర్ లు పోటీ పడే అవకాశముందని తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర శాఖలు మాత్రం రాహుల్ గాంధీయే తిరిగి అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. తీర్మానాలు చేసి ఏఐసీసీకి పంపుతున్నాయి.