Good News: ఫాస్టాగ్ కేవైసీ గడువు పెంపు
FASTag వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా
FASTag వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, NHAI 'ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్' కోసం గడువును మార్చి చివరి వరకు పొడిగించనుంది. గతంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు అని చెప్పింది. అయితే Patym FASTag వినియోగదారులు ఇప్పటికీ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గడువును పొడిగించడం మినహా మాకు వేరే మార్గం లేదని ఓ అధికారి తెలిపారు.
FASTAG-KYC అప్‌డేట్ గడువు ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ సిస్టమ్ తీసుకురావడానికి ఫాస్ట్-కేవైసీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో వాహనానికి ఒక కేవైసీ ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వాహనం, ఒక ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చింది. KYC ప్రక్రియను పూర్తి చేయడానికి జనవరి 31 వరకు ఇంతకు ముందు గడువు విధించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29 వరకు గడువును పొడిగించింది. ఇప్పుడు మరో నెల రోజుల పాటూ పొడిగించారు. KYC పూర్తి చేయకుండానే ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఫాస్టాగ్ KYCని తప్పనిసరి చేసినట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలను వెలువరించింది.