ఢిల్లీ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్ర‌మాదం

ఢిల్లీ ఎయిర్పోర్టులో రెండు విమానాలకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. రెండు ఫ్లైట్లకు

Update: 2023-08-23 10:36 GMT

ఢిల్లీ ఎయిర్పోర్టులో రెండు విమానాలకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. రెండు ఫ్లైట్లకు ఒకేసారి రన్ వే పైకి అనుమ‌తి ఇవ్వడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓ ప్లైట్ లోని మహిళా పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అలర్ట్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఆ రెండు ఫ్లైట్లలో ఉన్న 400 మంది ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రెండు విస్తారా విమానాల పైలట్లు సకాలంలో స్పందించడంతో వందలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి.

విస్తారా ఎయిర్‌లైన్స్ కు చెందిన అహ్మదాబాద్ - ఢిల్లీ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. అనంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆదేశాల మేరకు పైలెట్ పార్కింగ్ బే వైపు విమానాన్ని మళ్లించారు. ఇదే సమయంలో విస్తారా ఎయిర్ లైన్స్ కే చెందిన ఢిల్లీ - బాగ్డోగ్రా ఫ్లైట్ అదే రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునేందుకు ఏటీసీ పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయం గ్రహించిన అహ్మదాబాద్ - ఢిల్లీ ప్లైట్లోని ఉమెన్ పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఢిల్లీ - బాగ్డోగ్రా ఫ్లైట్ టేకాఫ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారు. ల్యాండైన విమానం పార్కింగ్ కు వెళ్లేందుకు అనుమతించిన విషయం మర్చిపోయిన ఏటీసీ అధికారులు టేకాఫ్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఏటీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. పైలట్లు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు ఫలితం వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.


Tags:    

Similar News