Arvind Kejriwal : ఢిల్లీకి ముఖ్యమంత్రి ఎవరు? జైలుకెళ్లి ఇన్ని రోజులయినా ఇక అంతేనా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు

Update: 2024-04-10 07:21 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆయనను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ను గత నెల 21వ తేదన అరెస్ట్ చేశారు. తర్వాత పది రోజుల పాటు ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉండి ఈ కేసులో విచారణను ఎదుర్కొన్నారు. తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించడంతో ఈ నెల 3వ తేదీన తీహార్ జైలుకు అధికారులు తీసుకెళ్లారు.

ఇరవై రోజుల నుంచి...
అయితే ఇప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరంటే కేజ్రీవాల్ అనే చెప్పకతప్పదు. ఆయన అరెస్టయి దాదాపు ఇరవై రోజులవుతుంది. అయితే ఢిల్లీ లో ముఖ్యమంత్రి లేకుండానే పాలన నడుస్తుంది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా దాదాపు ఇరవై రోజుల నుంచి పాలన సాగుతుందంటే మరెక్కడా ఇలాంటి పరిస్థితి తలెత్తలేదంటున్నారు రాజకీయ నిపుణులు. తాను అరెస్టయి జైలుకు వెళ్లినా కేజ్రీవాల్ మాత్రం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా మాత్రంచేయలేదు. అయితే దీనిపై ఇప్పటికే న్యాయస్థానాలలో కొందరు పిటీషన్లు కూడా వేశారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత...
గతంలో లాలూప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం కేసులో అరెస్టయినప్పుడు రబ్రీదేవి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లడంతో అప్పట్లో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి పదవిపై కూర్చోబెట్టారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తన సతీమణి సునీతను ముఖ్యమంత్రిగా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు కొందరు చెబుతున్నా ఇప్పటి వరకూ ఆ దిశగా అడుగులు పడటం లేదు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండి ఆదేశాలు జారీ చేయొచ్చేమో కానీ, పాలన సాగించలేరు. సమీక్షలను నిర్వహించలేరు. మరి సుప్రీంకోర్టులో ప్రస్తుతం తన అరెస్ట్ పై చివరి ప్రయత్నంగా అరవింద్ కేజ్రీవాల్ పిటీషన్ వేశారు. ఆయనకు సానుకూలంగా ఆదేశాలు రాకపోతే మాత్రం రాజీనామా చేయక తప్పదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News