భారత్ లో భూప్రకపంనలు
భారత్ లో అనేక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరకాశీ, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది;
భారత్ లో అనేక ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరకాశీ, అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.1 గా నమోదయింది. ఉత్తరకాశీలోని యమునా ఘాట్ నుంచి బార్కోట్ వరకూ, పురోలా నుంచి యమునోత్రి వరకూ ఈ భూకంప తీవ్రత కన్పించింది.
ప్రజలు భయాందోళనలతో.....
ఒక్కసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు. అండమాన్ నికోబార్ దీవుల్లోనూ భూకంపం సంభవించింది. ఇక్కడ రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.9 గా నమోదయింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు.