ED files Case against Veena: ముఖ్యమంత్రి కుమార్తెపై ఈడీ కేసు?

కేర‌ళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు;

Update: 2024-03-27 12:01 GMT
ED files Case against Veena, enforcement directorate, case, veena,  pinarayi vijayans daughter
  • whatsapp icon

ED files Case against Veena:కేర‌ళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ కూతురు వీణ‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. వీణపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు చేశారు. వీణకు చెందిన ఎక్సాలాజిక్ అనే కంపెనీ, కొచ్చిలోని సీఎంఆర్ఎల్ మైనింగ్ కంపెనీ, కేఎస్ఐడీసీ కంపెనీలు అక్రమంగా చెల్లింపులు చేసిన‌ట్లు ఆరోపణలు వచ్చాయి.

కక్ష సాధింపు చర్యలో...
దీనిపై ఆదాయ‌ప‌న్ను వాఖ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఈడీ చ‌ర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, లోక్‌సభ ఎన్నికల వేళ ఇటువంటి చర్యలను కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం ఉసిగొల్పుతుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెబుతున్నారు.


Tags:    

Similar News