Karnataka : హంపిలో అగ్నిప్రమాదం.. దుకాణాలు, హోటళ్లు సహా.. ఇళ్లు దగ్ధం
తొలుత జనతా ప్లాట్ లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగగా.. ప్రముఖ మ్యాంగో ట్రీ హోటల్, అన్నపూర్ణేశ్వరి ఛత్రం;
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హంపిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో దుకాణాలు, టెంట్లు, పలు హోటళ్లు దగ్ధమయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో వస్తుసామాగ్రి మొత్తం మంటల్లో కాలిబూడిదైంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ అగ్నిప్రమాదంలో హంపిలోని జనతా ప్లాట్‌లోని ప్రముఖ మ్యాంగో ట్రీ హోటల్, అన్నపూర్ణేశ్వరి ఛత్రం, బట్టల దుకాణాలు దగ్ధమయ్యాయి.
తొలుత జనతా ప్లాట్ లోని బట్టల దుకాణంలో మంటలు చెలరేగగా.. ప్రముఖ మ్యాంగో ట్రీ హోటల్, అన్నపూర్ణేశ్వరి ఛత్రం, బట్టల దుకాణాలు దగ్ధమయ్యాయి. హోటల్‌లోని సిలిండర్లు పేలటంతో మ్యాంగో ట్రీ హోటల్ మొత్తం దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పివేశారు.