Elections : నేడు తొలి దశ ఎన్నికలు.. పోలింగ్ ప్రారంభం

నేడు తొలి దశ ఎన్నికలు దేశంలో జరగనున్నాయి. ఈరోజు 21 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి.

Update: 2024-04-19 01:42 GMT

నేడు తొలి దశ ఎన్నికలు దేశంలో జరగనున్నాయి. ఈరోజు 21 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేశారు. పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక రకాలుగా ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుంది. మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నేడు తొలిదశ పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 16.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రెండు రాష్ట్రాలకు...
తొలి విడతలో అరుణాచల్ ప్రదేశ్ లోని 60 స్థానాలకు, సిక్కింలోని 32 స్థానాలకు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులతో పాటు కేంద్ర ప్రాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలోనూ ఎన్నికలు జరగనున్నాయి.
భారీ భద్రత మధ్య...
ఇందుకోసం దాదాపు 18 లక్షల మంది ఎన్నికల సిబందిని వినియోగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల యంత్రాంగం ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను చూడటంలో సఫలీకృతమయింది. తొలి దశలో అత్యధిక స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. దేశంలో అనేక చోట్ల పారా మిలటీరీ బలగాలు పహారాకాస్తున్నాయి. ఇప్పటికే పోలిగ్ ప్రారంభం కావడంతో సాయంత్రం ఆరు గంటల వరకూ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మావోల ప్రాబల్యం ఉన్న బస్తర్ ప్రాంతంలోనూ నేడు పోలింగ్ జరగనుండటంతో బలగాలు మొహరించాయి.


Tags:    

Similar News