లాలూపై మళ్లీ కేసు విచారణ

మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను మరోసారి సీబీఐ విచారించనుంది

Update: 2023-01-14 02:30 GMT

మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను మరోసారి సీబీఐ విచారించనుంది. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాలిప్పిస్తానని భూములు తీసుకున్న కేసులో ఆయనను విచారించనుంది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది.

విచారించేందుకు...
ఈ మేరకు సీబీఐ ఈ కేసు విషయంలో త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రశ్నించే అవకాశాలున్నాయి. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కొదరి నుంచి భూములను తీసుకున్నారన్న కేసులో విచారించనుంది. ఈ కేసును తిరిగి విచారించాలని నిర్ణయించింది.


Tags:    

Similar News