Polling : దేశ వ్యాప్తంగా ప్రారంభమయిన పోలింగ్
దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. 97 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహఆర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 97 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ నేడు జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, పొరుగునే ఉన్న ఒడిశాలలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న 97 లోక్ సభ స్థానాలకు గాను 1,717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
97 స్థానాలకు...
ఇందుకోసం 1.92 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 17,70 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అయితే ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇక్కడ కేంద్ర బలగాలను మొహరించారు. ఈవీఎంలు మాత్రం ఇప్పటి వరకూ సక్రమంగానే పనిచేస్తున్నాయి.