Gas Cylinder Prices : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి

గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు గ్యాస్, పెట్రోలు ధరలపై సమీక్ష చేస్తాయి;

Update: 2024-08-01 04:07 GMT
oil companies,  increase,  prices,  gas cylinders
  • whatsapp icon

గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ప్రతి నెల మొదటి తేదీన చమురు సంస్థలు గ్యాస్, పెట్రోలు ధరలపై సమీక్ష చేస్తాయి. ఈరోజు ఆగస్టు 1వ తేదీ కావడంతో చమురు సంస్థలు సమీక్షించాయి. అయితే ఎల్‌పీజీ గ్యాస్ ధరలు స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలెండర్ పైనే ధరలు పెంచిన చమురు సంస్థలు గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధరను యధాతధంగా ఉంచాయి.

వాణిజ్య సిలిండర్ ...
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై 8.50 రూపాయలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు తెలిపాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో కమర్షియల్ సిలిండర్ ధర 1,896 రూపాయలకు చేరుకుంది. డొమెస్టిక్ ధరలు పెరగకపోవడంతో కొంత ఊరటనిచ్చినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News