గోల్డ్ లవర్స్ కు గ్రేట్ న్యూస్
దేశంలో తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది.
బంగారం ధరలు ఎప్పుడూ అంతే. పెరుగుతూనే ఉంటాయి. తగ్గితే అంత ఆనందం మరొకటి ఉండదు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు చెబుతుంటారు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి తగ్గుదల, రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం, కేంద్ర బడ్జెట్‌లో బంగారం కస్టమ్స్ డ్యూటీ పెంచడం, బంగారం దిగుమతులను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేనంతగా బంగారం ధరలు పెరిగి పోయాయి. అయినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.
సిల్వర్ కూడా...
అయితే దేశంలో తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై మూడు వందల రూపాయలు తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి ధరపై రెండు వందల రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 55,800 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 60,870 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర 78,000 రూపాయలకు చేరుకుంది.