కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపు
కర్ణాటకలో హిజాబ్ వివాదం సమసి పోలేదు.ఈ నెల 16 వరకూ విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.;
కర్ణాటకలో హిజాబ్ వివాదం సమసి పోలేదు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వానికి మాత్రం కళాశాలలను తెరిచేందుకు ధైర్యం చాలడం లేదు. ఈ నెల 16వ తేదీ వరకూ కర్ణాటకలో విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హిజాబ్ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. హైకోర్టులో వచ్చే సోమవారం విచారణ జరగనుంది.
హైకోర్టు చెప్పినా....
అయితే సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. విద్యాసంస్థల్లో యూనిఫారం ను మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. హిజాబ్, కాషాయం లేకుండా చర్యలు తీసుకుని విద్యాసంస్థలు తెరవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కళాశాలల సెలవులను ఈ నెల 16వ తేదీ వరకూ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు న్యాయస్థానాల నుంచి తీర్పు వెలువడే అవకాశముందని చెబుతున్నారు.