హైవేపైనే..రన్ వే... ఏర్పాట్లు పూర్తి
విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు భారత ప్రభుత్వం హైవేలను రన్ వేలుగా మార్చాలని నిర్ణయించింది
విపత్కర పరిస్థితుల్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు భారత ప్రభుత్వం హైవేలను రన్ వేలుగా మార్చాలని నిర్ణయించింది. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా గతి శక్తి మిషన్ కింద దేశంలో 28 ప్రాంతాల్లో ఈ రన్ వేలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం పదమూడు చోట్ల వీటి పనులు పూర్తయ్యాయి. ఈ తరహా రన్ వేలు ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉన్నాయి. కొరిశపాడు నుంచి జె పంగులూరు మండలం రేణింగ వరకూ ఐదు కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని రన్ వే గా మార్చారు.
సిమెంట్ రోడ్డుగా మార్చి...
ఐదు కిలోమీటర్ల రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చారు. అన్ని పరిశీలించిన తర్వాతనే రన్ వేలుగా వీటికి అనుమతి లభిస్తుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీ ఈ రన్వేలను ప్రారంభించనున్నారు. విపత్తు సమయాల్లో ఈ రన్ వేలు ఎంతో ఉపయోగపడతాయని రక్షణ శాఖ కూడా అభిప్రాయపడుతుంది. మధ్యలో ఉన్న డివైడర్లను తొలగించి సిగ్నల్ కోసం రాడార్ వాహనాన్ని ఏర్పాటు చేస్తారు.