భారీగా పెరిగిన వంటనూనెల ధరలు
మన దేశంలో నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుశెనగ నూనెకు డిమాండ్ పెరగడంతో.. వంటనూనెల ధరలు పెరుగుతున్నట్లు
వంటనూనెల ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. నెలరోజుల వ్యవధిలో రూ.15 నుంచి రూ.20 వరకూ ధరలు పెరగడంతో సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న వేరుశెనగ నూనె ధర పై లీటరుకు రూ.20 పెరిగి రూ.180కి చేరుకుంది. పామాయిల్ ధర లీటరుకు రూ.3 నుంచి రూ.5 వరకూ పెరగడంతో లీటర్ పామాయిల్ ధర రూ.104కు చేరింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర పెంపుపై మాత్రం కాస్త ఉపశమనం లభించింది. లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.135 వద్ద స్థిరంగా ఉంది.
మన దేశంలో నూనె గింజల పంటల ఉత్పత్తి తగ్గడం, విదేశాల్లో వేరుశెనగ నూనెకు డిమాండ్ పెరగడంతో.. వంటనూనెల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. డ్రాగన్ కంట్రీ అయిన చైనాలో వేరుశెనగ నూనెకు డిమాండ్ ఎక్కువ. అందుకే వాటి దిగుమతులకై చైనా మనపైనే ఆధారపడుతోంది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో మన దేశం నుంచి దిగుమతులను పెంచేసింది. అనుకున్న స్థాయిలో నూనె గింజల పంటల ఉత్పత్తి లేదని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.