మంచు తుఫాన్.. హై అలెర్ట్

జమ్మూకాశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది

Update: 2023-02-02 04:28 GMT

జమ్మూకాశ్మీర్ లోయలో భారీగా మంచు కురుస్తున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసింది. హిమపాతం ఎక్కువ స్థాయిలో ఉంటుందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో జమ్మూ కాశ్మీర్ లోయలోని బారాముల్లా, గందర్‌బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 కిలోమీటర్ల ఎత్తులో ప్రమాదకర స్థాయిలో మంచుకురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

19 మందిని రక్షించి...
గుల్‌మార్గ్ ఎగువ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తున్నందున ఇప్పటికే ఇద్దరు మరణించారు. నాలుగు జిల్లాల్లో భారీగా మంచు కురిసే అవకాశముందని, అక్కడకు వెళ్లవద్దని పర్యాటకులకు సూచించింది. ఐఎండీ అధికారులు సయితం వార్నింగ్ ఇచ్చారు. హిమపాతం నుంచి 19 మంది విదేశీ పర్యాటకులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మంచులో చిక్కుకుపోయే ప్రమాదముందని తెలిపింది.


Tags:    

Similar News