దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని లైసెన్స్‌ గన్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది వద్ద..

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు నేతలు, పార్టీలు..

Update: 2023-10-11 06:07 GMT

తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు నేతలు, పార్టీలు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. నవంబర్ 30న పోలింగ్ ఉండగా.. పోలింగ్‌కు ముందు ఒక రోజు వరకు ప్రచార పర్వం కొనసాగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీల నేతలు సమాయత్తం అవుతున్నారు. ఎవరి వారు తమ తమ షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంటున్నారు.

అయితే రాజకీయ నేతల ప్లాన్‌ ఇలా ఉంటే.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ రక్షణ చర్యలు చేపడుతున్నారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురి చేసే డబ్బులు, బంగారం, ఇతర గిఫ్ట్స్‌ల రవాణాను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తూ అడ్డుకుంటున్నారు. ఇక ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా లైసెన్స్‌డ్ గన్స్‌లను సరెండర్ చేయాలని సీపీ ఆనంద్‌ సదరు వ్యక్తులకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో లైసెన్స్‌డ్ గన్స్ వ్యవహారం మరోసారి ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 9,810 మంది అధికారికంగా గన్స్‌ కలిగి ఉన్నారని పోలీసుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఈ లెక్కలల్లో రాష్ట్రాల జాబితాలో టాప్‌లో ఉత్తరప్రదేశ్‌ ఉండగా, కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ అగ్రస్థానంలో ఉందని తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా లెక్కలు చూస్తే.. 33.69 లక్షల మంది లైసెన్స్‌ గన్స్‌ కలిగి ఉన్నారని తెలుస్తోంది. వీటిలో టాప్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ - 13,29,584, మధ్యప్రదేశ్ - 2,82,675, కర్ణాటక - 1,20,719, పంజాబ్ - 81,516, నాగాలాండ్ - 44,473 లైసెన్స్‌డ్ గన్స్‌తో టాప్ 5 లిస్ట్‌లో ఉన్నాయి.

ఇక ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో లైసెన్స్‌డ్ గన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువగా. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక - 1,20,719 లైసెన్స్‌లతో అగ్రస్థానం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు - 24,237, కేరళ - 11,330, తెలంగాణ - 9,810, ఆంధ్రప్రదేశ్‌ - 7,007 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోలో అయితే లైసెన్స్‌డ్ గన్స్ కలిగి ఉన్నవారి సంఖ్య 9,810 ఉంగడగా, 2018 ఎన్నికల సమయంలో 9,070 మంది గన్ లైసెన్స్ కలిగి ఉన్నారు.ఈ ఐదేళ్ల వ్యవధిలో కొత్తగా 740 మందికి లైసెన్స్ జారీ చేసినట్లు రాష్ట్ర హోంశాఖ నివేదికలు చెబుతున్నాయి.

లైసెన్స్ గన్ కలిగి ఉన్న వారిలో అధికంగా భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. హైదరాబాద్‌లోని 3 పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోనే 5 వేలకుపైగా గన్‌ లైసెన్స్‌లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వీటిలో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌, పాతబస్తీలో ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News