ఛత్తీస్ గడ్ లో ఎదురు కాల్పులు

ఛత్తీస్ గడ్ లో మరోసారి మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి

Update: 2024-12-08 04:03 GMT

ఛత్తీస్ గడ్ లో మరోసారి మావోయిస్టులకు, భద్రతాదళాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఛత్తీస్ గడ్ లోని పోలీస్ బేస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడులు చేశారు. బీజాపూర్ జిల్లాలోని జీడిపల్లి పోలీస్ బేస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులు రాకెట్ లాంచర్లతో దాడులకు దిగారని అధికారులు చెబుతున్నారు.

కొనసాగుతున్న కాల్పులు...
దీంతో పోలీసులు ప్రతి దాడికి దిగారు. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య పోలీసు కాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో ఒక జవానుకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. కాల్పులు కొనసాగుతున్నాయి. బేస్ క్యాంప్ పై మావోయిస్టులు దాడులు చేయడం ఇది రెండోసారి అధికారులు తెలిపారు. భద్రతాదళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News