Hemant Soren : హేమంత్ సోరెన్ అరెస్ట్
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాంచీలోని హేమంత్ సోరెన్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలకు పైగానే ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. భూకుంభకోణానికి సంబంధించి ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటించారు.
కొద్దిరోజులుగా విచారణ...
ఈ కేసులోనే గత కొద్దిరోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. తన అరెస్ట్ తథ్యమని తేలడంతో ఆయన నిన్ననే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపే సోరన్ ను జేఎంఎఎం శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. హేమంత్ సోరెన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి చేయాలని భావించినా కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగా పార్టీలో సీనియర్ నేత చంపే సోరెన్ కు ఆ పదవి దక్కింది.