Breaking : భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలను భారీ పెంచింది.
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలను భారీ పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ కర్ణాటకలో ఇతర ప్రాంతాల కంటే కర్ణాటకలో పెట్రోలు, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపర్చడంతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడటంతో పెట్రోలు డీజిల్ ధరలు పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక భారం భరించలేక...
కర్ణాటకలోనూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన నాటి నుంచి మ్యానిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఆర్థిక వనరులు సహకరించడం లేదు. ఇప్పటికే విద్యుత్తు ఛార్జీలను పెంచిన ప్రభుత్వం, తాజాగా పెట్రోలు, డీజిల్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెట్రోలు పై మూడు రూపాయలు, డీజిల్ పై 3.20 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కర్ణాటకలో లీటరు పెట్రోలు ధర 102.85 రూపాయలు కాగా, డిజిల్ ధర 88.93 రూపాయలకు చేరుకుంది.