Free Bus : కర్ణాటక తరహాలోనా? తెలంగాణ మాదిరిగానా? ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉండబోతుందంటే?

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు దిగుతుంది.

Update: 2024-06-29 05:38 GMT

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో కర్ణాటక ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు దిగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుండటంతో కన్నడ నాట టెక్నిక్ లతో కొంత ఉచిత జర్నీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనుమతించింది. అయితే ఎక్కువ రద్దీగా ఏర్పడటంతో పాటు బస్సుల్లో కనీసం నిల్చునేందుకు కూడా పురుషులకు చోటు లేకపోవడం, సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తుండటంతో అనేక విమర్శలకు దారి తీశాయి. ఆర్టీసీకి ఆదాయం రాకపోగా నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనాలను రూపొందించారు. ఆర్టీసీకి నేరుగా డబ్బులు జమ చేయాల్సి రావడంతో ఖజానాపై భారం పడింది. ఫలితంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచింది. విద్యత్తు ఛార్జీలను కూడా పెంచింది.

కర్ణాటకలో మాత్రం...
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించినప్పుడు ఫొటో గుర్తింపు కార్డు, ఏదైనా అడ్రెస్ ప్రూఫ్ చూపిస్తే ప్రయాణానికి అనుమతించేవారు. కానీ తర్వాత రద్దీని తగగ్ించడానికి శక్తి స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకు వచ్చింది. సేవా సింథ్ వెబ్‌సైట్ ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి దరఖాస్తు చేసుకున్నవారికే ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ పధకం వర్తిస్తుందని చెప్పారు. అందులో ఎలాంటి తప్పులేదు. అయితే ఉచిత ప్రయాణం కేవలం సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లోనే మహిళలు ఉచితంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సిద్ధరామయ్య సర్కార్ అమలుచేసిన ఈ పథకంతో అనేక ఇబ్బందులు ఆదిలో ఎదురయ్యాయి. వాటిని అధిగమిస్తూ అనేక మార్పులు, చేర్పులు చేసుకుంటూ వెళుతున్నారు.
ఆ బస్సులను తగ్గించి...
డీలక్స్, సూపర్ డీలక్స్, గరుడ, లగ్జరీ, సెమీ లగ్జరీ, ఏసీ, ఏసీ స్లీపర్, నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ఉచిత ప్రయాణం వర్తించదన్న నిబంధన పెట్టింది. అంతవరకూ బాగానే ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది. అయితే రాను రాను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే బస్సుల్లో ఈ సర్వీసులను బాగా తగ్గించారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ ల స్థానంల డీలక్స్, సూపర్ లగ్జరీ, సెమీ లగ్జరీ బస్సులను ఎక్కువగా ప్రవేశపెట్టింది. దీంతో మహిళలు కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరో నిబంధన కూడా కర్ణాటక ప్రభుత్వం తెచ్చింది. మగవారి కోసం కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోకుండా నిబంధన విధించారు. పురుషుల కోసం కొన్ని సీట్లను రిజర్వ్ చేశారు. ఇక బెంగళూరు నగరంలో సిటీ సర్వీసులను కూడా భారీ సంఖ్యలో తగ్గించారన్న ఆరోపణలున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోనూ...
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కర్ణాటక, తెలంగాణలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో ఆటోవాలాల నుంచి వ్యతిరేకత వచ్చింది. వారు తమ ఉపాధి దెబ్బతినిందని ఆందోళన చెందారు. దీంతో ఆటోవాలల జీవనభృతికి ఇబ్బంది కలగకుండా బస్సు సర్వీసులు నడిచేలా బస్సు వేళలు పాటించేలా చర్యలు తీసుకోవాలనుకుంటుంది. ప్రధానంగా విజయవాడ, విశాఖల్లోనే సిటీ బస్సుల ఇబ్బంది ఏపీ ప్రభుత్వానికి ఎదురవుతున్న నేపథ్యంలో మరే విధానాన్ని తీసుకు వస్తారన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News