కశ్మీర్ యువకుడిని కోటీశ్వరుడిని చేసిన డ్రీమ్ 11

Dream11 అనేది ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతించే భారతీయ ఫాంటసీ క్రీడా వేదిక.

Update: 2022-05-25 02:36 GMT

డ్రీమ్ 11.. క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించిన బెట్టింగ్ యాప్. ప్రతి మ్యాచ్ కు 11 మంది ఆటగాళ్లను సెలెక్ట్ చేసుకోవడం.. సెలెక్ట్ చేసుకున్న 11 మంది బాగా ఆడారంటే ఎక్కువ పాయింట్స్ తో టాప్ లో నిలబడడం.. ప్రైజ్ మనీ సంపాదించుకోవడం. డ్రీమ్ 11 లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు. నిపుణుల మాటలను కూడా వింటూ ఉంటారు. చాలా మంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు.. ఇంకొందరు మాత్రం ఉన్నదంతా పోగొట్టుకుంటూ ఉంటారు. కానీ కొంత మందికి మాత్రమే లక్కు బాగా కలిసొస్తే కోటీశ్వరులు అవుతూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తిని డ్రీమ్ 11 కోటీశ్వరుడిని చేసింది. కశ్మీర్ కు చెందిన యువకుడు ఒక్క మ్యాచ్ తో కోటీశ్వరుడు అయిపోయాడు.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహరా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఆన్‌లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్ 11లో రూ. 2 కోట్లు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు. షల్గామ్ బిజ్‌బెహరాకు చెందిన వసీం రాజా, వార్తా సంస్థ కశ్మీర్ న్యూస్ అబ్జర్వర్ తో మాట్లాడుతూ, శనివారం అర్థరాత్రి తాను గాఢ నిద్రలో ఉన్నానని, కొంతమంది స్నేహితులు తనకు ఫోన్ చేసి, డ్రీమ్ 11లో మొదటి నంబర్‌లో తాను ఉన్నానని చెప్పారని తెలిపాడు. దాదాపు రూ.2 కోట్లు గెలుచుకున్నట్లు తనతో చెప్పినట్లు వసీం రాజా చెప్పుకొచ్చాడు. ఈ వార్త తెలియగానే అతన్ని అభినందించడం ప్రారంభించారు. గత రెండేళ్ల నుంచి ఐపీఎల్‌లో ఫాంటసీ టీమ్‌లను సృష్టించడం ద్వారా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని వసీం తెలిపాడు. వసీమ్ నిద్రపోతుండగా, ఓ ఫ్రెండ్ ఫోన్ చేసి 'నువ్వు ఎంపిక చేసిన జట్టు డ్రీమ్ 11 యాప్ లో ప్రథమస్థానంలో ఉంది' అని చెప్పాడు. దాంతో, వసీమ్ డ్రీమ్ 11 యాప్ చూడగా, రూ.2 కోట్ల జాక్ పాట్ గెలుచుకున్నట్టు అందులో మెసేజ్ ఉంది. ఇదంతా ఒక కల లాగా ఉందని, పేదరికాన్ని అధిగమించేందుకు ఇది దోహదపడుతుందని వసీం చెప్పుకొచ్చాడు. "మా అమ్మ అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు నేను ఆమెను మంచి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగలను, "అని అతను చెప్పాడు. అతడు డ్రీమ్ ఎలెవన్‌లో విజేతగా నిలిచిన వార్తతో రాజా గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది.
Dream11 అనేది ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతించే భారతీయ ఫాంటసీ క్రీడా వేదిక. 


Tags:    

Similar News