కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో?
కేరళ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇచ్చేందుకుసిద్ధమైంది
కేరళ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇచ్చేందుకు కేరళ సర్కార్ సిద్ధమైంది. విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురికాకుండా తగినంత నీరు అందించేలా చూడాలన్న లక్ష్యంతో 'వాటర్ బెల్' విధానాన్ని అమలు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
ఎల్లుండి నుంచి...
దీంతో ఈ నెల 20 నుంచి 'వాటర్ బెల్'ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనుంది. ఉదయం10.30కి, మధ్యాహ్నం 12.30 గంటలకు 5 నిమిషాల చొప్పున ఈ బ్రేక్ ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రతి ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు.