కోవిడ్ తో కల్లోలం... రోజుకు నలభై వేల కేసులు
మహారాష్ట్రను కోవిడ్ వణికిస్తుంది. ఎన్నడూ లేని విధంగా రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రను కోవిడ్ వణికిస్తుంది. ఎన్నడూ లేని విధంగా రోజుకు నలభై వేల కేసులు నమోదవుతున్నాయి. ముంబయి, పూనే నగరాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా కన్పిస్తుంది. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నా కోవిడ్ బాధితులు మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. దీంతో నైట్ కర్ఫ్యూ ను అమలు చేయడంతో పాటు ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పగటి వేళల్లోనూ....
ఉదయం వేళల్లో కూడా ఎవరూ ఐదుగురికి మించి గుమికూడేందుకు వీలులేదు. ప్రయివేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో యాభై శాతం మంది సిబ్బంది పనిచేయడానికే అనుమతిచ్చింది. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ తమకు లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని, ప్రజలు కోవిడ్ నిబంధనలను పాటిస్తే మహమ్మారిని తరిమేయవచ్చని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కోరారు.