చంద్రయాన్-3పై అవగాహనా రాహిత్యం

ట్రోల్ అవుతున్న రాజకీయ నాయకులు చంద్రయాన్ -3 పై కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ట్రోల్ అయిన విషయం తెలిసిందే.

Update: 2023-08-24 10:52 GMT

చంద్రయాన్-3పై అవగాహనా రాహిత్యం

ట్రోల్ అవుతున్న రాజకీయ నాయకులు

చంద్రయాన్ -3 పై కేరక్టర్ ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్ ట్వీట్ ట్రోల్ అయిన విషయం తెలిసిందే. ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్ టీ చల్లారుస్తున్న కేరీకేచర్ , బ్రేకింగ్ న్యూస్.., చంద్రుడినుంచి విక్రమ్ లాండర్ పంపిన మొదటి చిత్రం వచ్చింది వావ్...జస్ట్ ఆస్కింగ్ అని ఆయన ట్వీట్ పోస్టు చేయడంతో ప్రజలకు ఆయనపై ఇంకా కోపం తగ్గలేదు సరికదా.. కేసుకూడా నమోదైంది.



ప్రస్తుతం అవగాహనారాహిత్యంతో పొలిటికల్ లీడర్స్ ట్వీట్స్ కూడా అదేవిధంగా ట్రోల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్తాన్ క్రీడల శాఖ మంత్రి అశోక్ చందన చంద్రయాన్- 3లో ప్రయాణించి చంద్రుడిపై కాలుమోపిన వారికి శుభాభినందనలు తెలిపారు. అయితే చంద్రయాన్-3 మానవరహిత శాటిలైట్ అని మనందరికి తెలుసు.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రయాన్ 3 సక్సెస్ పై స్పందిస్తూ, అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారత వ్యోమగామి రాకేష్ శర్మ కాగ, బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు రాకేష్ రోషన్ పేరును ప్రస్తావించి ట్రోల్ అవుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వాడ్రన్ లీడర్ రాకేష్ శర్మ మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలసి సోయజ్ టి -11 రాకెట్ ద్వారా 1984 ఏప్రిల్ 3న అంతరిక్షంలోకి వెళ్లారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయనతో మాట్లాడుతూ అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనబడుతోంది అని అడగ్గా.. మహ్మద్ ఇగ్బాల్ రచించిన ’సారే జహాజ్ సే అచ్చా హిందుస్తాన్ హమారా...‘ అని సమాధానం ఇవ్వగా.. ఆమె సగర్వంగా నవ్విన నవ్వు భారతీయుల మనస్సులో ఎప్పటికీ నిలిచిపోతుంది.

Tags:    

Similar News