Loksabha Elections : నేడు చివరి దశ ఎన్నికలు.. ఈరోజు ప్రముఖులందరూ బరిలో నిలిచిన నియోజకవర్గాలు
ఈరోజు దేశంలో లోక్‌సభ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమయింది
ఈరోజు దేశంలో లోక్‌సభ చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమయింది. మొత్తం 57 లోక్‌సభ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఆరు దశలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు ఏడో విడతతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఈరోజు చివరి దశ ఎన్నికల్లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఒడిశాలోని మిగిలిపోయిన 42 అసెంబ్లీ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నేడు జరగనున్నాయి. మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు సంబంధించి 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
హేమాహేమీలు...
పోలింగ్ ప్రక్రియ ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ జరగనుంది. తుది దశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం కూడా ఉది. వీరితో పాటు బెంగాల్ లోని మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రౌత్, లాలూప్రసాద్ కుమార్తె మిసా భారతి కూడా ఉన్నారు. తుది దశ ఎన్నికల నేటి తో పూర్తి కానుండటంతో సాయంత్రం ఆరున్నర గంటలకు దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ప్రసారం కానున్నాయి. గెలుపోటములపై అంచనాలు తెలుసుకునే అవకాశముంది. జూన్ 4వ తేదీన దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ ప్రారంభమై ఏడో దశ జూన్ 1వ తేదీతో ముగియనుంది.