ఎక్కువమంది నెటిజన్లు.. న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటున్నారో తెలుసా

ఆంక్షలు లేకపోయినా సరే.. నూతన సంవత్సర వేడుకలు తమ ఇళ్లలో.. కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటామని..

Update: 2022-12-31 08:37 GMT

2023 celebrations

2022కి స్వస్తి పలికి.. 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు.. ప్రపంచమంతా సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేందుకు.. పలు నగరాల్లోని రిసార్టులు, పబ్ లు, రెస్టారెంట్లు వేదికలవుతున్నాయి. చాలా మంది తమతమ కాలనీల్లో, అపార్ట్ మెంట్లలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండేళ్లుగా బహిరంగ వేడుకలపై ఆంక్షలున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వేడుకలపై మనదేశంలో ఆంక్షలు లేవు.

ఆంక్షలు లేకపోయినా సరే.. నూతన సంవత్సర వేడుకలు తమ ఇళ్లలో.. కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటామని చెబుతున్నారు నెటిజన్లు. లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నిర్వహించిన సర్వేలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ సర్వేలో దేశంలో 132 జిల్లాలకు చెందిన 13 వేల మందికి పైగా స్త్రీ, పురుషులు పాల్గొన్నారు. 63 శాతం పురుషులు, 37 శాతం మహిళలు పాల్గొన్న ఈ సర్వేలో.. 2023 న్యూ ఇయర్ వేడుకలను ఎలా జరుపుకుంటున్నారని అడగ్గా.. 55 శాతం మంది కొత్త ఏడాదికి ఇంట్లోనే స్వాగతం పలుకుతామని చెప్పారట.
మరో 19 శాతం మంది తమకు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే అలవాటు లేదని చెప్పగా.. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు మరో 5 శాతం మంది నెటిజన్లు చెప్పారు. 2 శాతం మంది కుటుంబంతో కలిసి తమ ఏరియాలో జరిగే వేడుకల్లో పాల్గొంటామని, మరో 3 శాతం మంది ఫ్యామిలీ మొత్తం రెస్టారెంట్ కు వెళతామని పేర్కొన్నారు. అంటే మొత్తంమీద ప్రతి 10 మందిలో 8 మంది న్యూ ఇయర్ వేడుకలను తమ ఇళ్లలో జరుపుకునేందుకు ఇష్టపడుతున్నారు. లోకల్ సర్కిల్స్ సంస్థ ఈ వివరాలను శనివారం వెల్లడించింది.


Tags:    

Similar News