మొదటి జాబితాను విడుదల చేసిన బీజేపీ.. ఎవరెవరికి అవకాశం దక్కిందంటే?

లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను

Update: 2024-03-02 13:50 GMT

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ నేత వినోద్ తావ్డే మీడియా సమావేశంలో ప్రకటించారు. అభ్యర్థుల తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి డీ అరవింద్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, సికింద్రాబాద్ నుంచి జీ కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవి లత, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి పీ భరత్, భోంగీర్ నుండి నరసయ్యగౌడ్ పోటీ చేయనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పోర్‌బందర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లోని 26 స్థానాలకు గానూ 15 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మంత్రి కిరెన్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుండి, ఎంపీ తపిర్ గావ్ అరుణాచల్ ఈస్ట్ నుండి.. ఎంపీ బిష్ణు పద రే అండమాన్ నికోబార్ నుండి, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ దిబ్రూగఢ్ నుండి పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది.



Tags:    

Similar News