Breaking : రేపు ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ప్రెస్‌మీట్ ఉందంటూ?

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షఎడ్యూల్ విడుదల కానుంది;

Update: 2024-03-15 07:06 GMT
central election commission,  schedule,  jammu and kashmir
  • whatsapp icon

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విలేకర్ల సమావేశం ఉందని మీడియాకు ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం అందింది. దీంతో రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసోం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కానుంది.

దేశమంతా కోడ్...
ఎన్నికల షెడ్యూల్ విడుదల ఇప్పటికే ఆలస్యమయింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడంతో కొత్తగా
ఇద్దరి కమిషనర్ల ఎంపిక
నిన్న జరిగింది. దీంతో రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. రేపటి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిన్న రాత్రే నిర్ణయం తీసుకుంది.




 



Tags:    

Similar News