శ్రీకృష్ణుడితో కుమార్తెకు వివాహం చేసిన తండ్రి.. ఎంతో గ్రాండ్ గా..!

Update: 2022-11-11 03:43 GMT

అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి, ఒక తండ్రి ఆమెకు శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాడు. గ్వాలియర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పెళ్లికి బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆమె మాట్లాడలేదు, చెవులు వినబడవు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం జరగదని నిర్ణయించుకున్న ఆయన తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. కుమార్తెకు వివాహం నిశ్చయించామని, తప్పకుండా రావాలంటూ బంధుమిత్రులకు కబురు పంపాడు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లిలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆహ్వానించారు.

బృందావనం నుండి భారీ ఊరేగింపులో భగవంతుడు అమ్మాయి వద్దకు వచ్చాడు. బ్యాండ్ మేళం, DJ లైట్లతో సందడితో నృత్యం చేశారు. రాత్రికి రాత్రే జరిగిన వివాహ వేడుకలు ఎంతో గ్రాండ్ గా జరిగాయి. తన వయసులో ఉన్న అందరు ఆడపిల్లల్లాగే ఆమె పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో ఆమె తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. "పెళ్లికి ఒకరోజు ముందే నా బంధువులందరినీ ఆహ్వానించాను. నా ఇతర కుమార్తెల పెళ్లిలో నేను చేసే విధంగానే అన్ని ఆచారాలు జరిగేలా చూసుకున్నాను. సోనాల్ పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆమె బంధువులు కూడా సంతోషంగా ఉన్నారు" అని అన్నారు శిశుపాల్.


Tags:    

Similar News