బంగాళాఖాతంలో అల్పపీడనం.. పెరగనున్న ఉష్ణోగ్రతలు
తుపానుగా మారాక దానికి మోచా అనే పేరు పెట్టనున్నారు. అయితే.. ఈ వాయుగుండం ఎటువైపుగా ప్రయాణించనుందో రేపటికి
బంగాళాఖాతం పై ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతం, ఆ పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో ఈ అల్పపీడనం మే 9కి (రేపు) వాయుగుండంగా కేంద్రీకృతమై.. ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ.. తుపానుగా బలపడుతుందని పేర్కొన్నారు. తుపాను ఉత్తర దిశగా కదిలితే ఇటువైపునున్న తేమంతా అటు వెళ్లడంతో.. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా పెరుగుతాయని తెలిపారు.
తుపానుగా మారాక దానికి మోచా అనే పేరు పెట్టనున్నారు. అయితే.. ఈ వాయుగుండం ఎటువైపుగా ప్రయాణించనుందో రేపటికి స్పష్టత వస్తుందన్నారు. ఒకవేళ తుపాను పశ్చిమ దిశగా తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఆదివారం ఏపీలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.