బిగ్ బ్రేకింగ్: ప్రధాని మోదీకి రాజీనామా లేఖ పంపిన ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి పదవికి రాజీనామా చేశారు.

Update: 2022-07-06 12:09 GMT

కేంద్ర మంత్రి ప‌ద‌వికి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేఖ‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి న‌ఖ్వీ స‌మ‌ర్పించారు. కేంద్ర మైనార్టీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రిగా న‌ఖ్వీ కొన‌సాగారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి రాజ్య‌స‌భ‌కు న‌ఖ్వీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. రేప‌టితో ఆయ‌న రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం కూడా ముగియ‌నుంది. ప్ర‌ధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర‌మంత్రులుగా కొన‌సాగుతున్న‌ రాజ్‌నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ.. అట‌ల్ బిహారీ వాజ్‌పేయి గ‌వ‌ర్న‌మెంట్‌లో కూడా కేబినెట్ మంత్రులుగా ప‌ని చేశారు. ఆ ఇద్ద‌రిలో ఇవాళ ఒక‌రు రాజీనామా చేశారు. మరో వైపు న‌ఖ్వీ ఉప రాష్ట్ర‌ప‌తి రేసులో ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా న‌ఖ్వీని పోటీ చేయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు స‌మాచారం. ఉద‌యం ప్ర‌ధాని మోదీతో జేపీ న‌డ్డా, న‌ఖ్వీ స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం ఆయ‌న రాజీనామా చేశారు. ఇక ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప‌ద‌వీకాలం ఆగ‌స్టు 10తో ముగియ‌నుంది.

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. దేశ అభివృద్ధికి నఖ్వీ చేసిన కృషికి ప్రధాని మోదీ బుధవారం ప్రశంసించారు. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే, నఖ్వీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌ (జెడియు) ఇద్దరూ రాజ్యసభ పదవీకాలాన్ని జూలై 7న ముగియనుంది. బీజేపీ, జెడియు పార్టీలు వారిని మళ్లీ రాజ్యసభకు పంపలేదు.


Tags:    

Similar News