నిన్న ఎంపీ.. నేడు యూపీ.. రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ !

డిసెంబర్ 25వ తేదీ, శనివారం రాత్రి నుంచి ఈ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం

Update: 2021-12-24 10:48 GMT

భారత్ లో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 350 దాటింది. దీంతో కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పండుగల సమయంలో.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో ఒమిక్రాన్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందన్న భావన వినిపిస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాలు ఆంక్షలతో కూడిన కర్ఫ్యూ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అక్కడ ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదుకానప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ రాష్ట్ర సీఎం గురువారం రాత్రి నుంచి కర్ఫ్యూను అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది.

రేపట్నుంచే అమల్లోకి

డిసెంబర్ 25వ తేదీ, శనివారం రాత్రి నుంచి ఈ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు 200 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. వేడుకల్లో పాల్గొనేవారంతా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని.. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని యోగి ప్రభుత్వం సూచించింది. మరో రెండు నెలల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ.. ఒమిక్రాన్ విజృంభణ దృష్ట్యా యూపీతో పాటు ఇత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని అలహాబాద్ హై కోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

ఢిల్లీలో వేడుకలు రద్దు

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అభ్యర్థించిన మరుసటి రోజే ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఆదేశాలను జారీ చేయడం విశేషం. యూపీలో ఇప్పటి వరకూ రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. ఇద్దరూ ఇటీవలే కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. దేశరాజధాని ఢిల్లీలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు.








Tags:    

Similar News