మరికాసేపట్లో బడ్జెట్...గ్యాస్ సిలిండర్ ధర పెంపు
మరికాసేపట్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతుండగా దేశంలో గ్యాస్ ధరలు పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసకున్నాయి
మరికాసేపట్లో బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండగా దేశంలో గ్యాస్ ధరలు పెంచుతూ చమురుసంస్థలు నిర్ణయం తీసకున్నాయి. అయితే గృహాల్లో వినియోగించే వంట గ్యాస్ ధర ను మాత్రం పెంచలేదు. కేవలం కమర్షియల్ సిలిండర్ ధరను మాత్రమే పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి.
కమర్షియల్ సిలిండర్‌నే...
ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రో ఉత్పత్తులపై సమీక్ష జరిపి ధరలు పెంచాలా? వద్దా? లేదా తగ్గించాలా? అన్న నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఈరోజు ఫిబ్రవరి ఒకటో తేదీ కావడంతో చమురు సంస్థలు ధరలపై సమీక్షించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను పథ్నాలుగు రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం యధాతధంగా కొనసాగుతుంది.