గుడ్ న్యూస్... తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి
వంట గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తగ్గిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరపై రూ.91.50 లు తగ్గంది. తగ్గిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయని చమురు సంస్థలు తెలిపాయి. దీంతో కొంత వినియోగదారులకు ఊరట కలగనుంది.
నేటి నుంచే అములోకి..
19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 1976 రూపాయల నుంచి 1,885 రూపాయలకు దిగి వచ్చింది. హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,798.50 గా ఉండనుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం కొంత ఊరట కల్గించే అంశమే. దీనిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు గుడ్ న్యూస్ గానే చెప్పాలి. అయితే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు వెల్లడించాయి.