Gas Cylinder : భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఇక ఊరటేగా?
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వారికి చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ను వినియోగించే వారికి చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. భారీగా ధరలు తగ్గించాయి. లోక్‌సభ ఎన్నికలు చివరి దశ ముగిసే రోజు వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణం తీసుకున్నాయి. ఒక్కొక్క సిలిండర్ ధరపై డెబ్బయి రెండు రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ల ధర మాత్రం తగ్గలేదు. పెరగలేదు.
వాణిజ్య సిలిండర్ ...
19 కిలోల వాణిజ్య సిిలిండర్ ధరపై 72 రూపాయలు తగ్గించడంతో 1,745 రూపాయాలకు బదులు 16,76 రూపాయలు ఇక వసూలు చేస్తారు. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. దీనివల్ల చిరు వ్యాపారులు కొంత ఊరట చెందినట్లే. నిత్యావసరాలు, కూరగాయలు ఎండలకు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించి కొంత చమురు సంస్థలు ఊరట కలిగించాయి.