గ్యాస్ ధరలు తగ్గాయ్

వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.;

Update: 2023-04-01 04:12 GMT
గ్యాస్ ధరలు తగ్గాయ్
  • whatsapp icon

వినియోగదారులకు చమురు కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే కమర్షియల్ సిలిండర్‌కు మాత్రమే తగ్గిన ధరలు వర్తిస్తాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పై 92 రూపాయల వరకూ తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయించాయి.

ప్రతి నెల ఒకటోతేదీన...
ప్రతి నెల ఒకటో తేదీ ధరలపై సమీక్ష చేసే చమురు కంపెనీలు కేవలం కమర్షియల్ సిలిండర్ ధరలకు మాత్రమే ధరలు తగ్గించాయి. తగ్గించిన ధరలు వెంటనే అమలులోకి రానున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడంతో కొంత వినియోగదారులపై భారం తగ్గినట్లేనని చమురు సంస్థలు చెబుతున్నాయి.


Tags:    

Similar News