మళ్లీ పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులకు షాక్
మరోసారి పసిిడిిప్రియులకు షాక్ తగిలింది. బంగారం, వెండి, ధరలు భారీగా పెరిగాయి.
మరోసారి పసిిడిిప్రియులకు షాక్ తగిలింది. బంగారం, వెండి, ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరల పెరుగుదల అన్నది అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులను బట్టి ఆధారపడి ఉంటుంది. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధ వాతావరణం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే యాభైవేలు దాటేసిని బంగారం ధర త్వరలో 55 వేలకు చేరుకుంటుందన్న అంచనాలు విన్పిస్తున్నాయి.
ధరలు ఇలా....
ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 46,250 రూపాయలుగా ుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,460 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 70,000 రూపాయలకు చేరుకుంది. అయితే బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లపై ప్రభావం చూపవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకు డిమాండ్ కారణమంటున్నారు.