Karnataka results : కన్నీరు పెట్టుకున్న డీకే

కర్ణాటక ఫలితాలను చూసి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు.;

Update: 2023-05-13 07:39 GMT
Karnataka results : కన్నీరు పెట్టుకున్న డీకే
  • whatsapp icon

కర్ణాటక ఫలితాలను చూసి పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ గెలుపునకు కాంగ్రెస్‌లో నేతలందరూ కారణమని చెప్పారు. కార్యకర్తల నుంచి నాయకుల వరకూ అందరూ సమిష్టిగా పనిచేయడం వల్లనే కాంగ్రెస్‌కు గెలుపు సాధ్యమయిందని ఆయన కన్నీరు పెడుతూ చెప్పారు. ఇది సమిష్టి విజయంగా ఆయన అభివర్ణించారు.

భావోద్వేగానికి గురై...
డీకే శివకుమార్ ఇంత పెద్ద మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించడాన్ని బట్టి చూస్తే ప్రజలు తమ పార్టీపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతుందన్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు పర్చేలా చూసుకుంటామని తెలిపారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు డీకే శివకుమార్‌ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మల్లికార్జున ఖర్గేకు ధన్యావాదాలు తెలిపారు.


Tags:    

Similar News